KTR Brother In Law Party: కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఏర్పాటుచేసుకున్న విందును డ్రగ్స్ పార్టీగా అభివర్ణించడంపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తప్పు బట్టారు. మీడియా, పోలీసు శాఖ చూపిస్తున్న అత్యుత్సాహంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని.. కుటుంబం చేసుకున్న దావత్‌ను రేవ్ పార్టీ అని చెప్పడం దుర్మార్గంగా పేర్కొన్నారు.
Also Read: KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఇంట్లో జరిగిన పార్టీపై రోజంతా మీడియా, కాంగ్రెస్, బీజేపీలు చేసిన రాద్ధాంతంపై 'ఎక్స్' వేదికగా హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ అంశంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావుతోపాటు కాంగ్రెస్ నాయకులు చేసిన రచ్చపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటివి సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
'బురదజల్లడంలో భాగంగానే కేటీఆర్ బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. ప్రజల దృష్టి మళ్లించేందుకు జన్వాడ ఫాంహౌజ్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తోంది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 'రాజ్ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసు' అని చెప్పారు.
'రెండు రోజుల నుంచి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం.. చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే.. ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్' అని హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడిచేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 'వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం' అని చెప్పారు.
'కేటీఆర్, ఆయన సతీమణి గానీ ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరించడం గర్హనీయం. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్‌ను దెబ్బతీసేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదు' అని హరీశ్ రావు స్పష్టం చేశారు. 'పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని నా విజ్ఙప్తి' అని తెలిపారు.
'రోజురోజుకు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టిమళ్లించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు' అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజకీయాల్లో నేరుగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బురదజల్లడంలో భాగంగానే కేటీఆర్ బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట.
ప్రజల దృష్టి మళ్లించేందుకు సృష్టించేందుకే జన్వాడ ఫాంహౌజ్‌లో డ్రగ్స్ పార్టీలు…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 27, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.