Fake Currency Notes Printing is a Crime: కలర్ ఫుల్ ప్రింటర్ ఉంటే చాలు.. దేనినైనా సేమ్ టు సేమ్ అచ్చు గుద్దేస్తారు. ఉన్నది ఉన్నట్లు.. లేనిది లేనట్లుగా మార్చేస్తారు ఈ కంత్రీగాళ్లు.. గుర్తుపట్టలేనంతగా నకిలీని వర్జినల్ గా మార్చేస్తారు. వర్జినల్ ని డ్లూపికేట్ గా మార్చేస్తారు. ఈ కేటు .. డూప్లికేట్ గాళ్లు.. అసలు నోటు ఏదో, నకిలీ నోటు ఏదో కనిపెట్టలేనంతగా మాయ చేస్తారు. నగరంలో నకిలీ నోట్ల దందాగాళ్లు రెచ్చిపోతున్నారు. మరోసారి ఫేక్ కరెన్సీ తయారుచేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
డబ్బు సంపాదించాలంటే చదువు అవసరం లేదు. టెక్నాలజీ పరిజ్ఙానం ఉంటే చాలు. నకిలీ డబ్బులనే తయారు చేయవచ్చు అని నిరుపించాడు రంజిత్ సింగ్.. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం... అదే నకిలీ డబ్బులను తయారు చేయడం చాలా ఈజీ అనుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన తోమండ్ర రంజిత్ సింగ్ గతంలో సివిల్ కన్స్ర్టక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అతనికి ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఈజీ మనీ వైపు మొగ్గు చూపాడు.
సింపుల్ మనీ కోసం ప్రయాత్నాలు చేసి ఆంద్రప్రదేశ్‌లోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు.. విశాఖపట్నంలో ఒక కేసుల్లో నిందితుడై రంజిత్ సింగ్ జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. అదే టైంలో అనకాపల్లి జిల్లా కొవ్వూరు గ్రామంకు చెందిన మోహన్ రావు అనే నిందితుడితో రంజిత్ సింగ్ పరిచయం ఏర్పడింది. మోహన్ రావు గతంలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఇద్దరు కలిసి ఈజీ మనీ వైపు మొగ్గు చూపి జైలుకెళ్లారు. అయినా వక్రమబుద్దీ మార్చుకోని ఇద్దరు నకలీ నోట్లు ముద్రించేందుకు ప్లానింగ్ చేశారు..
నకిలీ కరెన్సీ నోట్లు ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకునేందుకు యూట్యూబ్ మీద దృష్టి పెట్టారు. యూట్యూబ్ లో పలు వీడియోలు చూసి ఫేక్ కరెన్సీ నోట్స్ ముద్రించేందుకు ప్లానింగ్ చేశారు. కలర్ ప్రింటర్, స్కానర్, ఒక కంప్యూటర్, పేపర్ తో పాటు అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. 500, 200 ,100, 50 రూపాయాలను రంజిత్, మోహన్ రావు ముద్రించేవారు. ముఠా సభ్యులను ఏజెంట్లను నియమించుకునేవారు. నకిలీ కరెన్సీ ఏజెంట్లను ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్‌తో సంప్రదింపులు జరిపేవారు.
కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారి ఏజెంట్లతో కలిసి 1.3 నిష్పత్తితో కర్సెనీ వ్యాపారాన్ని నిర్వహించే వారు. కూరగాయాల మార్కెట్లు, చిరు వ్యాపారులు, పండ్ల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రైతు బజార్ లాంటి ప్రాంతాల్లో రాత్రి సమయంలో అసలైన కరెన్సీ నోట్లతో కలిపి ఫేక్ కరెన్సీ బిజినేస్ చేసేవారు. అలా చేస్తున్న సమయంలో పోలీసులు ఈ ఘటనపై సమచారం అందుకుని నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చివరికి ఈ ఈజీ మనీకే అలవాటుపడి మరోసారి జైలు పాలయ్యారు.