నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు నేటితో ముగియనుంది. ఆఖరిరోజు వరకు ఎదురుచూసిన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేయడం తెలిసిందే.
నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన మంగళవారం నాడు టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి నోముల భగత్ నామినేషన్(Nagarjuna sagar Bypoll) పత్రాలు సమర్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితో తదితరులు నోముల భగత్ వెంట ఉన్నారు.
Also Read: COVID-19 Cases: తెలంగాణలో నిన్న ఒక్కరోజు 463 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
తనకు పదవిపై వ్యామోహం లేదని, కేవలం రెండు మూడేళ్ల కోసం బరిలో దిగలేనని కొన్ని నెలల కిందట వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి(Jana Reddy) ఎట్టకేలకు నాగార్జన సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ చివరిరోజైన నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్ వేశారు. అందుకు సంబందించిన పత్రాలను సమర్పించారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము ముందుకు వెళతామని జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా సాధాసీదాగా నామినేషన్ కార్యక్రమం ముగిసింది.
Also Read: Nagarjuna sagar Bypoll: నాగార్జునసాగర్ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసిన టీఆర్ఎస్
ముగిసిన తుది గడువు
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలుకు తుది గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మార్చి 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్ 3 వరకు తుది గడువు ఉంది. నాగార్జున సాగర్, తిరుపతి అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితం వెల్లడించనున్నారని తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook