Hyderabad Drugs Case: ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై దాడులు జరిపారు. పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా.. ఆ సమయంలో పబ్‌లో ఉన్న 150 మంది వరకు యువతీ యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో పలువురు సినీ, రాజకీయ, వీఐపీల పిల్లల పేర్లు బయటకొచ్చాయి. ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్, మెగా డాటర్ నిహారిక కొణిదెల తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
డ్రగ్స్ కేసుపై టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. పిల్లలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబసభ్యుల రక్తనమూనాలు ఇచ్చేందుకు సిద్ధమన్న రేవంత్.. కేటీఆర్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీయా అని సవాల్ విసిరారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఆది నుంచి పోరాడుతుంది తానే అని చెప్పారు. కేసు విచారణకు ఎవ్వరూ అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. పబ్ లో దొరికిన 142 మంది శాంపుల్స్ అప్పుడే ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. కొందరిని ఆ కేసు నుంచి తప్పించడం కోసం అందరినీ వదిలేశారని రేవంత్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో తన బంధువులు ఉన్నా శిక్షించాలన్నారు. చిల్లర ఆరోపణలు చేస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగేదిలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పంజాబ్ తరహాలో డ్రగ్స్ కు అడ్డాగా చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి కుటుంబం కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
Also Read: Hyderabad Drugs Case: ఆ 'మూడు టేబుళ్ల'పై ఫోకస్... ఎవరెవరున్నారో కూపీ లాగుతున్న పోలీసులు...
Also Read: డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు.. ప్రముఖ బీజేపీ నేత కుమారుడు... బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook