RGV :కొండా సురేఖకు మరిచిపోలేని గుణపాఠం నేర్పాలి.. ? ఆర్జీవి సంచలన కామెంట్స్..

RGV Comments on Konda Surekha: ఎపుడు ఏ విషయమై అంతగా స్పందించని ఆర్జీవి.. తాజాగా తనకు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీపై సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 3, 2024, 04:39 PM IST
RGV :కొండా సురేఖకు మరిచిపోలేని గుణపాఠం నేర్పాలి.. ? ఆర్జీవి సంచలన కామెంట్స్..

RGV Comments on Konda Surekha: ఉరిమి వచ్చి మంగళంపై పడ్డట్టు కేటీఆర్ ను విమర్శించాల్సిన తెలంగాణ మంత్రి.. అది విడిచిపెట్టి.. ఎటువంటి సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన హార్రిబుల్ కామెంట్స్ తో అవమాన పరిచిన కొండా సురేఖ వ్యాఖ్యలకు తాను షాక్ కు గురయినట్టు చెప్పారు ఆర్జీవి. రాజకీయంగా కేటీఆర్ పై మాట్లాడాలనుకుంటే.. ఆయనపై మాట్లాడాలి. కానీ సమాజంలో మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున  కుటుంబాన్ని బజారు కీడ్చడం ఏ మాత్రం భరించకూడదన్నారు.  

కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని అంత దారుణంగా అవమానించాల్సిన అవసరం ఏమిటో తనకు అర్ధమవ్వడం లేదన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ ఇష్యూలో తనను ఎవరో అవమానించారని .. అసలు ఆ పనితో సంబంధ లేని నాగార్జున, నాగ చైతన్యలతో పాటు సమంతలను దారుణంగా అవమానాల పాలు చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు.

అసలు థర్డ్ క్లాస్ వెబ్ సైట్లు కూడా ప్రచురించడానికి సాహసం చేయని జుగుప్సాకరమైన నిందలు తనదే చూసినట్టు చెవులతో విన్నట్టు అంత నిక్కచ్చిగా మీడియా ముందు చెప్పడం ఎంత దారుణం అన్నారు. ఒక మంత్రిగా ఆమె ఈ పదవిలో ఉండటానికి అనర్హురాలు అని చెప్పాలి. వెంటనే రేవంత్ రెడ్డి ఆమెను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలన్నారు. మొత్తంగా టాలీవుడ్ లో ఎంతో లెగసీ ఉన్న అక్కినేని ఫ్యామిలీ హీరోలతో పాటు దేశం గర్వించదగ్గ నటి అయిన సమంతపై అలాంటి నీచమైన మాటలు అనడాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే అన్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ విషయంలో వెంటనే స్పందించి ఇలాంటివి ఇకపై జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరుపున అడగుతున్నాన్నారు ఆర్జీవి. సమంతకు కొండా సురేఖ క్షమాపణ చెప్పడం ఏమిటి..?
ఆమె అక్కడ ఎంతో జుగుప్సాకరంగా ఇన్సల్ట్ చేసింది నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్యని.. ఒక మామాగారు, ఒక భర్త.. ఒక కోడలితో పాటు ఒక ఇల్లాలిని తీవ్రంగా కొండా సురేఖ అవమానించిందన్నారు.

తమ ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్ తో సమంతను పంపించడానికి ట్రై చేస్తే.. తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన అవమానం ఉంటుందా..! ఇది సమంతను మాత్రమే అవమానించడమే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే అందరి బాగు కోసం నాగార్జున, నాగ చైతన్యలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని భవిష్యత్తులో ఎవరు ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖకు మరిచిపోలేని గుణపాఠం నేర్పాలి.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

Trending News