తెలంగాణ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్- వైసీసీ పార్టీలకు ముడిపెడుతూ చంద్రబాబు విమర్శలు సంధించారు. తెలంగాణలో పోటీ చేసే ఆస్కారం ఉన్నప్పటికీ వైసీపీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు మేలు చేసేందుకు వైసీపీ పోటీ చేయడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ కు వైసీపీ పరోక్ష మద్దతు ఇస్తోందని చంద్రబాబు దయ్యబట్టారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కే తమ మద్దతు అని వైసీపీ నేతలు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుంటే..వైసీపీ కూడా అందులో భాగస్వామిగా ఉండటం సిగ్గుచేటు అని చంద్రబాబు వ్యాఖ్యనించారు
పవన్ పై చంద్రబాబు విమర్శలు
ఇదే సందర్భంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై కూడా చంద్రబాబు విమర్శలు సంధించారు. వైసీపీ మాదిరిగానే పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా అంతే ఉందని ..జనసేన పార్టీ బీజేపీకి అండగా ఉంటోందని..రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాల్సి పోయి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలుపన్నినా తెలంగాణలో మహాకూటమి ..ఏపీలో టీడీపీ విజయాన్ని ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.