TamiliSai: తెలంగాణ గవర్నర్ తమిళ్ సై టార్గెట్, హద్దు మీరుతున్న బాడీ షేమింగ్ ట్రోలింగ్

TamiliSai: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ రూలింగ్ పార్టీ వివాదం పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రధమ మహిళపై ట్రోలింగ్ హద్దు మీరుతోంది. ఏకంగా బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు కొందరు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2022, 02:20 PM IST
TamiliSai: తెలంగాణ గవర్నర్ తమిళ్ సై టార్గెట్, హద్దు మీరుతున్న బాడీ షేమింగ్ ట్రోలింగ్

TamiliSai: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ రూలింగ్ పార్టీ వివాదం పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రధమ మహిళపై ట్రోలింగ్ హద్దు మీరుతోంది. ఏకంగా బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు కొందరు.

తెలంగాణ గవర్నల్ తమిళ్ సై వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య చెలరేగిన వివాదం ఇంకా సమసిపోలేదు. సరికదా..హద్దు మీరుతోంది. అధికార పార్టీ కార్యకర్తలు, అభిమానులు గవర్నర్ తమిళ్ సైను టార్గెట్ చేస్తున్నారు. 
సోషల్ మీడియాలో గవర్నర్ తమిళిసైపై విమర్శలు హద్దుమీరుతున్నాయి. ఓ మహిళపై..అది కూడా రాష్ట్ర ప్రథమ మహిళపై చేస్తున్న పోస్టులు బరితెగించిపోతున్నాయి. బాడీషేమింగ్ చూస్తూ వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా చేస్తున్న పోస్టులు వెలువడుతున్నాయి. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 

సోషల్ మీడియాలో హద్దుదాటితే ఖబడ్దార్. ఎవర్నీ ఉపేక్షించం. ఇదీ తరచుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చెప్పేమాట. కానీ ఇది కేవలం అధికార పార్టీ వ్యతిరేక పోస్టులకు మాత్రమే పరిమితమవుతోందా... విపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అడ్డగోలు పోస్టులు పెట్టినా వాటిపై చర్యలు మాత్రం శూన్యమేనా.. మరీ గవర్నర్ తమిళ్ సైపై దిగజారి పోస్టులు చేస్తున్న వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదనేది సర్వత్రా విన్పిస్తున్న ప్రశ్న. ఇప్పుడు కొత్తగా మరో పోస్ట్.. ఓ పార్టీ ఫేస్‌బుక్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గవర్నర్‌ను దిష్టిబొమ్మగా చూపిస్తూ చేసిన ఆ పోస్ట్‌పై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అయినా ఇలాంటి వాటిపై పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రథమమహిళపై ఈ విధమైన పోస్టులు సమంజసం కాదంటున్నారు. విమర్శలు చేయాలంటే అవి సున్నితంగా ఉండాలని.. మరీ ఇలా బరితెగించడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. 

Also read: Kids Whitener Addiction Video: షాకింగ్ వైరల్ వీడియో.. వైట్నర్ సేవిస్తూ మత్తులో తూలుతున్న మైనర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News