Rishi Sunak: బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో రిషి సునాక్ వెనకబడ్డారు. రిషి, లిజ్ ట్రస్‌ల మధ్య జరుగుతున్న పోరు తుది అంశానికి చేరుకుంది. వచ్చేవారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ కానున్నాయి. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది.
Rishi Sunak: బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో రిషి సునాక్ వెనకబడ్డారు. రిషి, లిజ్ ట్రస్‌ల మధ్య జరుగుతున్న పోరు తుది అంశానికి చేరుకుంది. వచ్చేవారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ కానున్నాయి. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న ఫలితాలు వెలువడుతాయి. అయితే తదుపరి ప్రధానిగా సునాక్ కంటే లిజ్ ట్రస్‌కు అవకాశాలు గణనీయంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పోటీలో గెలుపు 90 శాతం ఆమెనే వరించే అవకాశాలున్నాయని స్థానిక బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ స్మార్కెట్స్ అంచనా వేసింది.