Pakistan Debt: పాక్ ఆర్థిక పరిస్థితి దారుణం...రూ.50లక్షల కోట్లు దాటిన​ అప్పులు...

Pakistan: ఆర్థిక వనరులు లేక పాక్ అల్లాడిపోతుంది. విదేశాల నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేని స్థితిలో ఉంది. తమ దేశ అప్పులు రూ. 50 లక్షల కోట్లు దాటినట్లు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ వెల్లడించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 04:34 PM IST
Pakistan Debt: పాక్ ఆర్థిక పరిస్థితి దారుణం...రూ.50లక్షల కోట్లు దాటిన​ అప్పులు...

Pakistan Debt: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థతి రోజురోజుకీ దిగజారుపోతుంది. దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన ధనం ప్రభుత్వం వద్ద లేదని స్వయంగా దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) వెల్లడించారు. రానురాను ఆర్థిక వ్యవస్థ నడిపించేందుకు విదేశాల మీద ఆధారపడుతున్న పాకిస్థాన్​ అప్పుల (Pakistan Debt) ఊబిలోకి కూరుకుపోతుంది. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8బిలియన్‌ డాలర్లు అప్పు చేసింది.

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ (State Bank of Pakistan)బుధవారం విడుదల చేసిన వివరాలు.. పాక్​ బాకీలను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాక్ అప్పులు రూ. 50 లక్షల కోట్లు (Pakistan Debt) దాటినట్లు ఎస్​బీపీ తన నివేదికలో వెల్లడించింది. ఇమ్రాన్​ ఖాన్​ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితి (Pakistan Debt) మరింత దిగజారినట్లు తెలుస్తోంది. బాకీ ఉన్న రూ.50.5 లక్షల కోట్లలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్​ హయాంలోనే పెరిగినట్లు ఎస్​బీపీ తెలిపింది. 

Also Read: Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్​

గడిచిన 39 నెలల్లో 70శాతం అప్పులు పెరిగాయని స్థానిక మీడియా తెలిపింది. 2018 జూలై నుంచి 2021 జూన్ మధ్య రూ.14.9 లక్షల కోట్ల రుణాన్ని పాక్​ ప్రభుత్వం పొందినట్లు సమాచారం. అప్పుల ఊబి నుంచి పాకిస్థాన్‌ బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని ప్రధాని ఇమ్రాన్ విజ్ఞప్తి చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News