World Press Freedom Day Theme 2023: పత్రికా స్వేచ్ఛ అవగహాన పెంచేందుకు ప్రతి ఏడాది మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రతికా స్వేచ్ఛ ప్రాముఖ్యతపై అవగాహాన పెంచడానికి ప్రజల్లో అవగాహాన కార్యక్రమాలు చేస్తారు. ఐక్యరాజ్యసమితి 1993లో మే-3 వ తేదీ నుంచి మీడియా స్వేచ్ఛ గురించి చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. చివరగా 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశం తర్వాత ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది ఐక్య రాజ్యసమితి.
జర్నలిజాన్ని ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. నిష్పాక్షికమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. అందుకే ప్రతి సంవత్సరం మే 3వ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19లో భారతీయులకు ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ఇప్పుడు ప్రతికలు స్వాతంత్ర్యంగా అన్ని వార్తలు రాయగలుగుతున్నాయి. ఇంటర్నేషనల్ జర్నలిజం ఫ్రీడమ్ డే ఎందుకు జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
భారత్ గత సంవత్సరం పత్రికా స్వేచ్ఛ సూచికలో 142వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సంవత్సరం 150వ స్థానానికి పడిపోయి..దిగజారుతూ వస్తోంది. ప్రస్తుతం భారత్ వ్యాప్తంగా లక్షకుపైగా వార్తా పత్రిక సంస్థలున్నాయి. వాటిలో 380పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పత్రికా స్వేచ్ఛ గురించి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ తెలుపుతుంది. ఈ సంవత్సరం వెల్లడించిన ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ మొదటి స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది. ప్రస్తుతం చాలా దేశాల్లో రాజకీయ ఒత్తిళ్ళు, ప్రభుత్వాలు పత్రికలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్ల పత్రికా స్వేచ్ఛల్లో ఆటంకాలు వస్తున్నాయి.
స్వాతంత్రోద్యమంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయి. ఈ సమయంలో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రతికలు ప్రధానంగా వ్యవహరించాయి. భారత రాజ్యాంగంలో ఎన్నో రకాల అధికారాలున్నప్పటికీ పత్రికా స్వేచ్ఛ విషయం గురించి ఎక్కడ పేర్కొలేదు. 19A(1) అధికరణ ప్రకారం పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో ప్రస్తుతం ప్రతికలు స్వాతంత్రంగా పని చేస్తున్నాయి. 1975-77 క్రమంలో ఎమర్జెన్సీ ఏర్పడడం వల్ల పత్రికాస్వేచ్చకు చీకటి రోజులు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా ప్రతికలు కనుమరుగయ్యాయి.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం 2023 థీమ్ "హక్కుల భవిష్యత్తును రూపొందించండి.. అందరి హక్కులకు పెద్దగా, భావవ్యక్తీకరణ స్వేచ్ఛగా మారండి."
A free press is essential for exposing threats such as human rights abuses, corruption, misinformation & much more.
If everything is all right in the news, then something is wrong with journalism.
Wednesday is #WorldPressFreedomDay. https://t.co/oWoAbfPj37 via @UNESCO pic.twitter.com/L15BkYAoeE
— United Nations (@UN) May 3, 2023
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook