IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 14, 15, 16 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
ఏపీలో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు అల్పపీడనం తోడు కావడంతో అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే ఏపీలోని కొన్ని జిల్లాలకు ఈ నెల 17 వరకూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రాగల మూడు గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో రానున్న 3-4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
భారీ వర్షాల కారణంగా అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారుల్ని 24 గంటలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
Also read: AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటీఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.