CM Jagan: విశాఖ వేదికగా ప్రతిపక్షాలపై సీఎం వైఎస్ జగన్ మరోసారి విరుచు పడ్డారు. ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ సాయం ఆపలేదన్నారు. గత ప్రభుత్వంలా దోచుకుని దాచుకోలేదని చెప్పారు. బాబు పాలనలో ఈ-ఫైన్లు, చలాన్ల పేరుతో రూ.40 నుంచి రూ.50 కోట్లు గుంజారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు, పచ్చ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. తనకున్నది నిజాయితీ, ప్రజల తోడు, దేవుడి ఆశీస్సులని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాను ప్రజల మీద, దేవుడి దయ మీద ఆధారపడతానన్నారు. తన పాదయాత్రలో డ్రైవర్ సోదరుల కష్టాలను చూశానని..పవర్‌లోకి రాగానే వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వాహనమిత్ర పథకాన్ని తీసుకొచ్చానన్నారు సీఎం.
ప్రభుత్వ కష్టం కన్నా..ప్రజల కష్టమే తనకు ముఖ్యమని..అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్న అన్ని పథకాలను ఆచరణలో పెడుతున్నామని గుర్తు చేశారు సీఎం వైఎస్ జగన్. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు తోడుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ వేదికగా వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని అమలు చేశారు. 2 లక్షల 61 వేల 516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261.52 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేశారు సీఎం.
Also read:Minister Roja: చిత్తూరు జిల్లాలో మంత్రి రోజాకు నిరసన సెగ..కోల్డ్ వారే కారణమా..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
CM Jagan: ప్రభుత్వ కష్టం కన్నా..ప్రజల సమస్యలే ముఖ్యం..సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర
విశాఖ జిల్లాలో కార్యక్రమం
లబ్ధిదారుల ఖాతాల్లోకి సాయం