బ్రేకింగ్ న్యూస్: ఏపీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 

Last Updated : Mar 9, 2018, 11:18 AM IST
బ్రేకింగ్ న్యూస్:  ఏపీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే అయిదేళ్లలో రైతన్నల ఆదాయ వనరులను పెంచడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. రూ.19,070 కోట్లతో ఆ సంవత్సరం ఏపీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18,602 కోట్లు కాగా, పెట్టుబడి వ్యయం రూ.468 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. ద్వితీయ అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధిరేటు సాధించడం జరిగిందని, అది జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే 14 శాతం అధికంగా ఉందని ఆయన తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రబీలో 42శాతం వర్షపాతం తక్కువగా నమోదవ్వడం వల్ల వరి దిగుబడి కొంతమేరకు తగ్గినా హెక్టారుకు 5,176 కిలోల ఉత్పత్తిని నమోదు చేయడం విశేషమని ఆయన తెలిపారు. 

వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులివే
*ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4730 కోట్ల కేటాయింపులు చేశారు. 
*రైతు రథం పథకంలో భాగంగా రూ.2.50 లక్షల రాయితీతో ట్రాక్టర్ల మంజూరు చేస్తామని తెలిపారు
*కౌలు రైతుల రుణానికి రూ.2346 కోట్లు కేటాయించారు
*వ్యవసాయ రంగ యాంత్రీకరణకు రూ. 258 కోట్ల కేటాయింపులు చేశారు
*కరువు నివారణ కోసం రూ.1042 కోట్లను కేటాయించారు
*అజిమ్ ప్రేమ్జీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలువురు శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయ సంబంధిత పరిశోధనలు చేసేందుకు గాను రూ.100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు

Trending News