అమరావతి: పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను మెచ్చిన జనం..రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చి వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టారు.ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన రాగానే...తాను మేనిఫోస్టోను బైబిల్, ఖురాన్, భగవత్ గీతలా భావిస్తానన్న వైఎస్ జగన్.. చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికల సమమంలో నవరత్నాల హామీలు తప్పకుంటా అమలౌతాయనే నమ్మకం జనాల్లో ఏర్పడింది.
ఇదిలా ఉంటే సచివాలయంలో అడుపెట్టినప్పటికీ సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్ .. వాటి ఆమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్న వైసీపీ సర్కార్..మరికొన్ని పథకాలు అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా అమలు చేసే పథకాలకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకున్న సీఎం జగన్ .. పథకాల జాబితా , వాటి అమలుకు తేదీలను సైతం ప్రకటించారు.
ఏయే పథకాలు ఎప్పుడంటే..
* 2019, సెప్టెంబర్ చివరి వారంలో సొంత ఆటో, ట్యాక్సీ వాలాకు రూ.10వేల ఆర్థికసాయం
* 2019, అక్టోబరు 15న నుంచి రైతు భరోసా పథకం అమలు; ఈ పథకం ద్వారా కౌలు రైతులకు ఏటా రూ.12,500 వేల ఆర్ధిక సాయం
* 2019, నవంబర్ 21 నుంచి మత్స్య దినోత్సవాన్ని పుసర్కరించుకొని మత్స్యకారుల పడవలు, బోట్లకు రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం.
* 2019, నవంబర్ చివరి వారంలో డీజిల్ వినియోగదారులకు సబ్సిడీ పథకం ప్రారంభం. ప్రస్తుతం లీటర్‌పై రూ.6 ఇస్తుండగా.. దీన్ని రూ.9కి పెంచుతున్నారు.
* 2019, డిసెంబర్ 21నుంచి చేనేత పథకం ప్రారంభం, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్ధిక సాయం
* 2020, జనవరి 26 న అమ్మ ఒడి పథకం ప్రారంభం; ఈ పథకం ద్వారా చదువుకు పంపించే తల్లితండ్రుల ఖాతాలో ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం
* 2020, ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు రూ.10 వేల ఆర్థికసాయం అందించే పథకం ప్రారంభం
* 2020, ఫిబ్రవరి చివరి వారంలో వైఎస్సార్ పెళ్లికానుక పథకం ప్రారంభం, ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి వైఎస్సార్ పెళ్లికానుకను ఇవ్వనున్న ఏపీ సర్కార్.
వాలంటీర్లదే బాధ్యత
సంక్షేమ పథకాల లబ్దిదారులకు సంబంధించిన వివరాలను సేకరించే బాధ్యతను గ్రామ, వార్డు వాలంటీర్లకు అప్పగించారు. వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా లబ్దిదారులకు పథకాలు అందించనున్నారు. పథకాలను ఎలా అప్లై చేయాలో వాలంటీర్లే గైడ్ చేస్తారు.