AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 09:58 AM IST
AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Heavy rains in AP: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు  మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం ఒడిశా, ఛత్తీస్ గడ్ దిశగా కదులుతోంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై లేకపోయినా తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. 

ఈ వాయుగుండ ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని... ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. అలాగే దక్షిణ ఒడిశా, తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమతీరాన్ని ఆనుకొని ఉన్న మరో ద్రోణి ప్రభావంతో.. కర్ణాటక, మహారాష్ట్రలోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

Also read: Sun Tranit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..!

రాష్ట్రంలో చాలా చోట్ల ముసురు వాతావరణం నెలకొని ఉంది. దీంతోపాటు అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. నదుల్లోకి వరద ప్రవాహం పెరగడంతో..అధికారులు గేట్లు ఎత్తి దిగువుకు నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న రాష్ట్రంలోని చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News