AP: కర్నూలులో ఏర్పాటు కానున్న తొలి పైలట్ శిక్షణా కేంద్రం

ఆంధ్రప్రదేశ్ లో తొలి పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. హైదరాబాద్, బెంగుళూరు ఎయిర్ పోర్టులకు సమీపంలో ఉన్న కర్నూలును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరోవైపు కర్నూలు ఎయిర్ పోర్టును విజయదశమికి అందుబాటులో తీసుకురానున్నారు.

Last Updated : Oct 9, 2020, 10:28 AM IST
  • కర్నూలులో రాష్ట్ర తొలి పైలట్ శిక్షణా కేంద్రం
  • 160 కోట్లతో అభివృద్ధి చేసిన కర్నూలు ఎయిర్ పోర్టు విజయదశమికి అందుబాటులో
  • ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి మూడు విమాన సర్వీసులు
AP: కర్నూలులో ఏర్పాటు కానున్న తొలి పైలట్ శిక్షణా కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో తొలి పైలట్ శిక్షణా కేంద్రం ( First Pilot Training Centre ) ఏర్పాటు కానుంది. హైదరాబాద్, బెంగుళూరు ఎయిర్ పోర్టులకు సమీపంలో ఉన్న కర్నూలు ( Kurnool ) ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మరోవైపు కర్నూలు ఎయిర్ పోర్టును విజయదశమికి అందుబాటులో తీసుకురానున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ ఒక్కొక్కటీ సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా తొలి పైలట్ శిక్షణా కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) సన్నాహాలు చేస్తోంది. ఇటు హైదరాబాద్, అటు బెంగుళూరు ఎయిర్ పోర్టులకు సమీపంలో ఉన్నందున కర్నూలును ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారుడు, ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( Ap Airport Development Corporation limited ) ఎండీ ఈ విషయాన్ని వెల్లడించారు. పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం మూడు సంస్థలు ముందుకు రావడంతో..ఫైనాన్షియల్ బిడ్లు పిలవనుంది ప్రభుత్వం. ఈ శిక్షణా కేంద్రానికి సంబంధించిన మౌళిక సదుపాయాల్ని ఆ సంస్థే సమకూర్చుకోవల్సి ఉంటుందని..కర్నూలు ఎయిర్ పోర్టు ల్యాండ్ ఉపయోగించుకున్నందుకు ఎయిర్ పోర్టు కార్పొరేషన్ కు అద్దె చెల్లించాల్సి ఉంటుందని కార్పొరేషన్ తెలిపింది.

కేంద్ర పౌర విమానయాన సంస్థ ( Central Aviation Department ) నుంచి అనుమతులు రాగానే కర్నూలు ఎయిర్‌పోర్టు ( Kurnool Airport ) ను విజయదశమికి అందుబాటులోకి తీసుకువస్తామని కార్పొరేషన్ వెల్లడించింది. కర్నూఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి కారుచౌకగా విమాన సర్వీసులు నడపడానికి ట్రూజెట్‌ సంస్థ మూడు రూట్లు దక్కించుకుంది. కర్నూలు నుంచి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. ప్రస్తుతం పగటి పూట మాత్రమే విమానాలు నడుపుతారు. రెండవ దశలో రాత్రి వేళ కూడా సర్వీసులు ప్రారంభిస్తారు. దాదాపు 970 ఎకరాల్లో 160 కోట్లతో ఏపీఏడీసీఎల్‌ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు.  Also read: Ram vilas Paswan death: రామ్ విలాస్ పాశ్వాన్‌కి ఏపీ సీఎం నివాళి

Trending News