Viral Video: సెక్రటేరియట్ షాకింగ్.. మూడో అంతస్థు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. వీడియో వైరల్..

Maharashtra deputy speaker: మహారాష్ట్రలో  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గిరిజన తెగకు సంబందించి రిజర్వేషన్ విషయంలో నిరసన తెలియజేస్తూ ఆయన ఏకంగా మూడో అంతస్థు నుంచి కిందకు దూకేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 4, 2024, 04:01 PM IST
  • మహారాష్ట్రలో అనుకొని ఘటన..
  • ఆందోళన వ్యక్తం చేసిన నేతలు..
Viral Video: సెక్రటేరియట్ షాకింగ్.. మూడో అంతస్థు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. వీడియో వైరల్..

Maharashtra deputy speaker jumps off third floor video: మహారాష్ట్ర రాజకీయాలు రచ్చగా మారాయి.  ఈ క్రమంలో  కొన్నిరోజులుగా మహారాష్ట్రలో రిజర్వేషన్ లో అంశం వార్తలలో ఉంటుంది. గిరిజన తెగకు సంబంధించి రిజర్వేషన్ విషయంలో సచివాలయంలో రిజర్వేషన్ లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యేతోపాటు, డిప్యూటీ స్పీకర్ నరహారి ఝిర్వాల్, సచివాయంలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు.

 

 జీర్వాల్‌తో పాటు బీజేపీ ఎంపీ హేమంత్ సవ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమతే, హిరిమాన్ ఖోస్కర్, రాజేష్ పటేల్ కూడా సేఫ్టీ నెట్‌లపై దూకిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అక్కడున్న భద్రత సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని సెఫ్ చేశారు.

కానీ అక్కడ ఇదివరకు భవనం సెఫ్టీ కోసం నెట్ ను ఏర్పాటు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఆ నెట్లోకి పడిపోయారు. వెంటనే భద్రత సిబ్బంది,పోలీసులు అక్కడికి చేరుకుని వారికి కాపాడారు.  గిరిజన తెగ అయి ధంగర్ కమ్యునిటీనీ షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరిలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ నిరసనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. మరోవైపు అక్కడ నెట్ లు లేకుంటే పరిస్థితి ఏంటని కూడా పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

Read more: Viral Video: ఏంది తాత ఇది.. ?.. 70 ఏళ్ల పెద్దాయనను పెళ్లి చేసుకున్న .. 20 ఏళ్ల పడుచమ్మాయి.. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా గిరిజన తెగకు సంబంధించి రిజర్వేషన్ ల అంశం మహారాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై అధికార, అపోసిషన్ పార్టీలు నువ్వా.. నేనా..అన్న విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత డిప్యూటీ స్పీకర్ చేసిన పని ప్రస్తుతం సెక్రెటెరియట్ లో అందరిని టెన్షన్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు. కొంత మంది దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News