Theft in tirumala parakamani: తిరుమల శ్రీవారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. భక్తులు తమ కొంగు బంగారంగా భావిస్తారు. అందుకే స్వామి వారి దర్శనం కోసం వందల కిలో మీటర్ల దూరం నుంచి వస్తుంటారు. ఎన్నిగంటలైన.. ఎంత మంది జనాలున్న కూడా... కంపార్ట్ మెంట్లలో వేచి చూసి.. ఆ దేవ దేవుడి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అలాంటి తిరుమలలో ఇటీవల కాలంలో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కలిప్రభావమో.. మరేంటో కానీ.. ఇటీవల తిరుమలలో ఎప్పుడు కూడా జరగని ఘటనలు... అస్సలు ఊహించనరి ఘటనలు వార్తలలో ఉంటున్నారు.
తిరుమలలో లడ్డు వివాదం ఎంతో వివాదంగా మారిందో తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు వరకువెళ్లింది. ఆతర్వాత కొంత మంది పవిత్రమైన మాడ వీధుల్లో.. చెప్పులు వేసుకుని, రీల్స్ చేస్తు వివాదంగా ప్రవర్తించారు. కొంతమంది రాజకీయ నాయకులు టీటీడీ గురించి, రాజకీయాల గురించి మాట్లాడి వివాదాలు రాజేశారు. మరోవైపు ఇటీవల వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణి సమయంలో జరిగిన ఘోరంమాత్రం.. తిరుమల చరిత్రలో ఒక మచ్చగా చెప్పుకొవచ్చు.
ముఖ్యంగా టీటీడీ అధికారులు, పోలీసులు మాత్రం పూర్తిగా సమన్వయం చేసుకొవడంలో విఫలమయ్యారని స్పష్టంగా కన్పిస్తుంది.అయితే.. ప్రస్తుతం తిరుమలో ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు.అంతే కాకుండా.. తిరుమల హుండీలో.. కొంత మంది నిలువు దోపిడి, బంగారం, వెండి, వజ్రాలు, ఇలా తమకు తోచిన విధంగా హుండీలో వేస్తుంటారు. ఇదంతా.. టీటీడీ సిబ్బంది పరకామణిలో ఉంచి లెక్కగడుతుంటారు. పరకామణిలో శ్రీవారికి వచ్చిన డబ్బులు, ఆదాయం లెక్కగట్టేందుకు కూడా ప్రత్యేకంగా సేవలు చేసేందుకు చాలా మంది ముందుకొస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని మాత్రం అందర్ని షాకింగ్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు. శ్రీవారి ఆలయంలో పరకామణిలో సేవచేసేందుకు వచ్చిన ఒక బ్యాంక్ ఉద్యోగి.. శ్రీవారి బంగారం బిస్కట్ ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. పెంచలయ్య అనే బ్యాంక్ ఉద్యోగి.. వంద గ్రాముల బంగారంను తీసుకుని.. వ్యర్థాలను పడేసే ట్రాలీలో సీక్రెట్ గా వేసేందుకు ప్రయత్నించాడు.
Read more: Tirumala: అలిపిరిలో మళ్లీ చిరుత హల్ చల్.. టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలు.. అసలేం జరిగిందంటే..?
దీంతో అక్కడున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గమనించాడు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని తిరుమలలో రెండో టౌన్ పీఎస్ కు తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి ఆలయంలో సేవచేసేందుకు వచ్చి.. స్వామికే శఠగోపం పెట్టేందుకు ప్రయత్నించడం ఏంటనికూడా భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter