Sania Mirza Seond Marrige: టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా డేటింగ్..! రెండో పెళ్లికి సిద్ధం..?

Sania Mirza Dating Rumors: షోయాబ్ మాలిక్‌తో విడాకుల తరువాత సానియా మీర్జా రెండో పెళ్లిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్‌ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్‌లో ఉన్నారని.. అతడినే పెళ్లి చేసుకుంటుందని గతంలో వార్తలు రాగా.. అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో పెళ్లి పుకార్లు పుట్టించారు. ఇంతకు ఆ హీరో ఎవరు..? ఈ పుకార్లు నిజమేనా..?
 

1 /7

టెన్నిస్‌లో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంది సానియా మీర్జా. 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు, అవమనాలను ఎదుర్కొన్నారు.  

2 /7

పాకిస్థాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో సానియాను దారుణంగా విమర్శించారు. అన్నింటిని భరించి.. కెరీర్‌లో రాణించింది.  

3 /7

అయితే షోయాబ్ మాలిక్ మరో మహిళ మాయలోపడి సానియాను దూరం పెట్టాడు. ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు.  

4 /7

బ్రేకప్ తర్వాత షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకుని సెటిల్ అయిపోగా.. సానియా మీర్జా ఒంటరిగా ఉంటోంది. గత మహ్మద్‌ షమీతో పెళ్లి అంటూ ఏఐ జనరేటెట్‌ పిక్స్‌ను కొందరు వైరల్ చేసిన విషయం తెలిసిందే.  

5 /7

అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లు గతకొద్ది రోజులు బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి.  

6 /7

దీంతో ఆ హీరో ఎవరా..? అని నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు. కొంతమంది మరో స్టెప్ ముందుకు వేసి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని చెబుతున్నారు. అయితే ఇదంతా ఒట్టి ప్రచారమేనని సానియా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.     

7 /7

ఈ ప్రచారంపై సానియా మీర్జా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం వివిధ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.