Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నిక బరిలో త్రిముఖపోరు, ప్రచారం నేటితో సమాప్తం

Badvel Bypoll: ఏపీ, తెలంగాణల్లో జరుగుతున్న బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. బద్వేలు బరిలో త్రిముఖపోరు నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడం విశేషం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2021, 02:28 PM IST
  • బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తం
  • బద్వేలు ఉపఎన్నికలో త్రిముఖపోరు, బరిలో 15 మంది అభ్యర్ధులు
  • బద్వేలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపు ప్రచార బాథ్యతలు తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నిక బరిలో త్రిముఖపోరు, ప్రచారం నేటితో సమాప్తం

Badvel Bypoll: ఏపీ, తెలంగాణల్లో జరుగుతున్న బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. బద్వేలు బరిలో త్రిముఖపోరు నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడం విశేషం.

తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకరవర్గం(Huzurabad Bypoll)ఉపఎన్నికతో పాటు ఏపీలోని బద్వేలు నియోజకవర్గానికి ఉపఎన్నిక(Badvel Bypoll)జరుగుతోంది. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా 72 గంటల ముందు అంటే నేటితో ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బద్వేలు బరి నుంచి తప్పుకున్నప్పటికీ త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బరిలో నిలిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ సుధ, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, బీజేపీ నుంచి పనతల సురేష్ పోటీలో ఉన్నారు. జనసేన బీజేపీకు మద్దతుగా నిలిచింది. ఈ ముగ్గురు కాకుండా మరో 12 మంది వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 

అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ అనంతరం 11న పరిశీలన ముగిసింది.13వ తేదీ ఉపసంహరణ అనంతరం చివరిగా 15 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల పర్వం అనంతరం వ్యూహాలు, ఎన్నికల ఎత్తులు, ప్రచారపర్వం కొనసాగింది. 20-25 రోజులుగా అభ్యర్ధులంతా ప్రచారంలో మునిగి తేలారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు అంజాద్ బాషా, నారాయణస్వామి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్(Polling), నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరనున్నాయి.

Also read: AP High Court: మహిళలకు అధికారమిస్తే తప్పేంటి, ఆందోళన ఎందుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News