Ap Govt Loan: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. జగన్ సర్కార్ అప్పుల వేట ఫలించింది. మరో మూడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని జగన్ సర్కార్ ఈ రుణం తీసుకోనుంది. వరుసగా 10, 15, 19 ఏళ్ల గడువుతో కొత్త రుణం తీసుకోబోతోంది జగన్ ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలానికి సంబంధించి శుక్రవారం వచ్చిన నోటిఫికేషన్ లో ఏపీ సర్కార్ రుణ ప్రయత్నాల విషయం వెల్లడైంది.
ఏపీ ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కొత్తగా అప్పు తెస్తేనే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా కొత్త రుణాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే పరిమితిని మించి అప్పులు చేయడంతో కొత్తగా రుణం దొరకని పరిస్థితి తలెత్తింది. కేంద్రం కూడా ఏపీ విషయంలో సీరియస్ గా ఉంది. కొత్త రుణాలకు కొర్రీలు పెట్టింది. గత ఏడాది చేసిన అప్పుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీనిపై రాష్ట్రం, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కొత్త అప్పుల కోసం ప్రయత్నాలు చేశారు. కేంద్ర ఆర్థికశాఖ అధికారుల చుట్టూ తిరిగారు. ఎట్టకేలకు కేంద్రాన్ని ఒప్పించారు. దీంతో 2022-23కు సంబంధించి కొత్త రుణాలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. వెంటనే మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ వేలంలో మూడు వేల కోట్ల రుణం కావాలని జగన్ సర్కార్ ఇండెంట్ పెట్టింది.
ఈ పైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటికే 4 వేల 390 కోట్లు అప్పులు తెచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మరో మూడు వేల కోట్ల రుణానికి లైన్ క్లియర్ కావడంతో... జగన్ ప్రభుత్వం 40 రోజుల్లోనే ఏడు వేల 390 కోట్లు అప్పు తెచ్చినట్లైంది. దేశంలోనే ఇదో రికార్డ్ అని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. మే నెలలో ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం 16 వందల కోట్ల రూపాయలు వేతనాలకు, 600 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్లకు, ఇతరత్రా అవసరాలకు మరో 2 వందల కోట్లు చెల్లింపులు మాత్రమే చేసింది. నిధులు లేకపోవడంతో అప్పులు కోసం చూస్తోంది. బుధవారం నాటికి కొత్త రుణం వస్తుండటంతో... చెల్లింపులు పూర్తి చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
READ ALSO: Revanth Reddy: రాహుల్ నోట.. రేవంత్ మాట.. ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఇక తిరుగే లేదా!
LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook