తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అతి విశ్వాసంతో ఉన్నారని ... ఒకే సారి 105 టికెట్లు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వ్యహం బెడిసికొట్టి అది టీఆర్ఎస్ ను దెబ్బతీస్తుందని జోస్యం చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు సమర్థులు ..కచ్చితంగా మార్చాల్సిన వారు కొందరు ఉంటారని అవేమి పట్టించుకోకుండా అవివేకంగా అభ్యర్ధులను ప్రకటించడం ఘోర తప్పిదమన్నారు. తెలంగాణలో తమకు తిరుగు లేదని కేసీఆర్ ఊహల్లో తేలుతున్నారని..అందుకే ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. పార్టీ అంతర్గత వ్యహారాలు, ఎలక్షన్ -2019 యాక్షన్ పై ప్లాన్ పై చర్చేందుకు ఉండవల్లి ప్రజావేదికలో జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యాలు చేశారు
ప్రజా కూటమిదే విజయం..
తెలంగాణలో ప్రజాకూటమి తప్పకుండా గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా కూటమి బలంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని..అయితే అభ్యర్ధుల ప్రకటన విషయంలో కొంత జాప్యం జరిగిందని.. వారం రోజుల ముందే అభ్యర్ధులను ప్రకటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఎలా ఉన్న తెలంగాణలో టీడీపీ అభ్యర్ధులు కచ్చితంగా గెలిచి తీరుతారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు
పోలీసు వ్యవస్థను జగన్ అవమానించారు
ఈ సందర్భంగా జగన్ దాడి అంశాంపై చంద్రబాబు స్పందిస్తూ ఈ వ్యహరంలో ప్రభుత్వం చేయాల్సింది చేసిందన్నారు. రాష్ట్ర పోలీసులుపై తనకు నమ్మకం లేదని జగన్ చెప్పడం సరికాదన్నారు. ఇది పోలీసు వ్యవస్థను అవమానించడమేని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టు కూడా జగన్ తీరును తప్పబట్టిందన్నారు. ఈ దాడి కేసులో ప్రభుత్వం ప్రమేయం ఉందని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు