రాహుల్ గాంధీ, చంద్రబాబు భేటీ ఎజెండా ఇదేనా..

                              

Last Updated : Oct 31, 2018, 06:58 PM IST
 రాహుల్ గాంధీ, చంద్రబాబు భేటీ ఎజెండా ఇదేనా..

రాహుల్ గాంధీ, చంద్రబాబు భేటీ అంశంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయంశంగా మారింది. రేపు జరగనున్న భేటీలో ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చ జరగనున్నట్లు టాక్.. ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీకూడా రాహుల్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నట్లు తెలిసింది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండటంతో చంద్రబాబు ఈ మేరకు రాహుల్ నాయకత్వాన్ని బలపర్చాలని నిర్ణయించినట్లు సమాచారం.

‘సేవ్ నేషన్’ పేరుతో బీజేపీకి ప్రత్యాన్మాయంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలె మాయవతితో భేటీ అయిన చంద్రబాబు..  రేపు రాహుల్ తో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్‌ అబ్దుల్లాతో సమావేశమవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలు, సాయంత్రం అఖిలేష్‌ యాదవ్‌తో ఆయన భేటీకానున్నారని సమాచారం. వీరందరినీ ఏకతాటిపై తెచ్చి కాంగ్రెస్ నాయకత్వంలోనే మహాకూటమిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు జాతీయ నేతలతో భేటీ అవుతున్నట్లు టాక్

టీడీపీ స్థానాలపై క్లారిటీ

రేపటి రాహుల్, చంద్రబాబు సమావేశంలో తెలంగాణలో పొత్తుల అంశంపై కూడా చర్చకు రానుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే స్థానాలపై క్లారీటీ రానుంది.  టీడీపీకి 13 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తుంటే ..టీడీపీ మాత్రం 15 స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 

Trending News