చంద్రబాబు కేరళ పర్యటన విశేషాలు

    

Last Updated : Nov 12, 2017, 06:54 PM IST
చంద్రబాబు కేరళ పర్యటన విశేషాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కేరళ వెళ్లి కొచ్చిన్ నగరాన్ని పర్యటించారు. అక్కడ అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో ఏర్పాటైన కన్వెన్షన్ సెంటరుతో పాటు మాల్‌ను కూడా సందర్శించారు. అటువంటి కన్వెన్షన్ సెంటర్‌నే ఇంకా ఆధునికతను ప్రతిబింబించేలా విశాఖ నగరంలో కట్టాలని ఆయన లూలూ గ్రూప్ ప్రతినిధులకు సూచనలు చేశారు. కొచ్చిన్‌లో ప్రస్తుతం ఉన్న కన్వెన్షన్ సెంటరులో పదివేల సీటింగ్ సామర్థ్యం ఉంది. అలాగే మాల్‌లో 250 గదులు ఉన్నాయి. దీనిని 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అలాగే బ్యాక్ వాటర్ ఫ్రంట్ ఈ సెంటర్‌కు ఉన్న అదనపు ఆకర్షణ. అయితే విశాఖలో నిర్మించబోయే కన్వెషన్ సెంటరుకి సముద్రతీరం ప్రధాన ఆకర్షణ అని.. దీనిని గుర్తుపెట్టుకొని దాని నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఆయన తెలిపారు. విశాఖలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయింది. 

Trending News