Chittoor Fire Accident: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం! పుట్టినరోజు నాడే మృత్యుఒడిలోకి

Three peoples dead in fire accident at Chittoor. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 21, 2022, 08:56 AM IST
  • చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం.
  • ముగ్గురు సజీవదహనం
  • పుట్టినరోజు నాడే మృత్యుఒడిలోకి
Chittoor Fire Accident: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం! పుట్టినరోజు నాడే మృత్యుఒడిలోకి

Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు. రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదం జరిగింది. చనిపోయిన ముగ్గురిలో తండ్రి కొడుకుతో పాటు అతని స్నేహితుడు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

అగ్ని ప్రమాదం జరిగిన రెండంతస్తుల భవనంలో పేపర్ ప్లేట్ల తయారీతో పాటు నిర్వాహకులు ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో యజమాని భాస్కర్‌ (65), అతని కొడుకు డిల్లీ బాబు (35) చిక్కుకున్నారు. వీరితో పాటుగా డిల్లీ బాబు స్నేహితుడు బాలాజీ (25) కూడా ఉన్నాడు. సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడంతో మంటల తీవ్రత పెరిగింది. దాంతో స్థానికులు ఇంటి గోడలు బద్దలు కొట్టి లోపలి వెళ్లగా.. అప్పటికే ముగ్గురు స్పృహ కోల్పోయారు. 

మంటల్లో చిక్కుకున్న బాధితులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఢిల్లీ బాబు పుట్టినరోజు నాడే తండ్రి, స్నేహితుడు కలిసి మృత్యువాత పడినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంతో రంగాచారి వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: IND vs AUS: ఆకాశమే హద్దుగా చెలరేగిన గ్రీన్, వేడ్‌.. తొలి టీ20లో టీమిండియా ఓటమి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News