Temperatures are low in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి పులి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డి.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తోంది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో 8.2 డిగ్రీల, పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. ఈ పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం కూడా ఉంది.
తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కుమురం భీం జిల్లా సిర్పూరులో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈశాన్య, తూర్పు భారత ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణలోకి ప్రవేశిస్తుండటంతో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ చలి కారణంగా ఉదయాన్నే ప్రయాణాలు చేయాలనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook