EPF: ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ లిమిట్‌ రూ.21,000 పెరిగితే.. ఉద్యోగికి నెట్‌ శాలరీ ఎంత అందుతుంది?

EPF EPS Contribution Hike: కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతనం సీలింగ్ రేటుని రూ.15వేల నుంచి రూ.21 వేలకు పెంచే ఆలోచన చేస్తోంది. దీంతో ఉద్యోగుల జీతంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సామాజిక భద్రత నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పరిమితి కవరేజీని పెంచింది. కంట్రిబ్యూషన్‌ లిమిట్‌ పెరిగితే ఉద్యోగుల జీతంలో ఎంత కోత విధిస్తారు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

2014లో ఈ వేజ్ సీలింగ్ ని రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిమితి పెంచితే కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. దీంతో ఉద్యోగుల జీతం పై ప్రభావం పడుతుంది. కానీ పెన్షన్ సమయంలో అధిక మొత్తంలో పొందవచ్చు.  

2 /5

కొత్తగా సవరించినున్న సీలింగ్ రేటు వల్ల ఈపీఎస్  కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. దీనివల్ల రిటర్మెంట్ సమయానికి ఎక్కువగా పెన్షన్ పొందవచ్చు. అంతేకాదు కార్పస్ పరిమితి కూడా పెరుగుతుంది. ఈపీఎఫ్ యాక్ట్‌ సెక్షన్ 6 ప్రకారం ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ 12% కనీస ఆదాయం ఫిక్స్ చేశారు. సీలింగ్ పెరిగితే శాలరీ ఎక్కువగా కట్ అవుతుంది. నెట్ ఇన్కమ్ పై ఈ ప్రభావం పడుతుంది.  

3 /5

ఒకవేళ ఎంప్లాయి శాలరీ రూ.23000 అయితే వేతన సీలింగ్ రూ. 21000 కు కేంద్ర ప్రభుత్వం పరిమితి పెంచితే అది ఉద్యోగి జీతం పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.ఉద్యోగి  రూ. 23 వేల జీతం  కంట్రిబ్యూషన్‌ 12% అనుకుంటే అది నెలకు 2,760 రూపాయలు అవుతుంది. ఇందులో ఈపీఎస్ కు 8.33% అంటే రూ. 1749 కాంట్రిబ్యూట్ కాగా, 3.67 అంటే రూ. 1,011 ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ వెళ్తుంది.  

4 /5

కొత్త సీలింగ్ విధానం ప్రకారం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరిగితే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ తగ్గుతుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందే సమయానికి మాత్రం ఎక్కువ మొత్తంలో పొందవచ్చు. (పెన్షన్‌= (సర్వీస్‌ × పెన్షన్‌ శాలరీ) / 70) క్యాల్‌కులేట్‌ చేస్తారు.  

5 /5

ప్రస్తుతం మీరు 35 ఏళ్లు ఉంటే 58 ఏళ్ళ వయసుకి రిటైర్మెంట్ అవుతారు. మీ నెలవారి జీతం ఒకవేళ రూ. 22,000 అయితే మీరు 23 ఏళ్లకు గాను ప్రతినెల రూ. 21000 సీలింగ్ రేటు మారితే రిటైర్మెంట్ సమయానికి రూ.6900 పెన్షన్ పొందుతారు. సీలింగ్ రేట్లు మార్పు లేకపోతే ప్రతినెల రూ.4929 అందుకుంటారు.