Pushpa 2 Real Collections: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో సంచలన విజయం సాధించింది. ఇక నార్త్ బెల్ట్ లో ఈ సినిమా అన్ని రికార్డులను మడత పెట్టేసింది. ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 అసలు కలెక్షన్స్ గుట్టు వీడినట్టు వార్తలు వస్తున్నాయి.
Pushpa 2 Real Collections: పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ఫైర్.. అని ఏ ముహూర్తానా సుకుమార్ అల్లు అర్జున్ తో ఈ డైలాగ్ చెప్పించాడో... నిజంగానే బాలీవుడ్ లో పుష్ప 2 ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ రేంజ్ కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ చిత్ర పరిశ్రమలో ఖాన్స్, కపూర్స్ వంటి స్టార్ హీరోలకు సాధ్యం కానీ రికార్డులను పుష్ప 2 తో అల్లు అర్జున్ సంచలనం రేపాడు.
అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1832 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్స్ విడుదల చేశారు. దీంతో ఆదాపు పన్ను శాఖ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ సంబంధించిన నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇళ్లపై, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించింది.
ఈ సందర్భంగా పోస్టర్ పై వేసిన కలెక్షన్స్ ను సంబంధించిన ప్రతి రూపాయి లెక్క అడిగి దర్శక, నిర్మాతలకు పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసారు ఆదాయ పన్ను అధికారులు. ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్యను ఏకంగా బ్యాంకు తీసుకెళ్లి లాకర్లు తెరిపించారు.
ఇక సుకుమార్ ను ఏకంగా ఎయిర్ పోర్ట్ లో పట్టుకొని ఆయన ఇంటికి, కార్యాలయాలకు తీసుకెళ్లి ఉక్కిరి బిక్కిరి చేసారు. అంతేకాదు పుష్ప 2కు సుకుమార్ దర్శకుడిగాన కాకుండా ఓ నిర్మాతగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కు వచ్చిన కలెక్షన్స్ లెక్కలపై లెక్కల మాస్టారికి ఐటీ అధికారులు చుక్కలు చూపించారు.
ఇక పుష్ప 2 పోస్టర్స్ పై నిర్మాతలు రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు పోస్టర్స్ ను విడుదల చేశారు. కానీ తీరా లెక్కల్లో దాదాపు రూ. 531 కోట్లకు పైగా తేడా వచ్చినట్టు ఆదాయ పన్ను అధికారులు కనిపెట్టారు.
కొంత మంది అల్లు అర్జున్ వీరాభిమానులు పుష్ప 2 సినిమా రూ. 2200 కోట్లు వసూళ్లు చేస్తే.. నిర్మాతలు.. కేవలం రూ. 1800 కోట్ల మాత్రమే పోస్టర్స్ వేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఒక రకంగా భారత్ లో ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ‘దంగల్’ సినిమా వసూళ్లను పుష్ప 2 క్రాస్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ కు సంబంధించిన కొంత మంది పుష్ప 2 కేవలం రూ. 2200 కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విడుదల చేశారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం పుష్ప 2 మూవీకి సంబంధించి రూ. 1250 కోట్ల గ్రాస్ కు మాత్రమే టాక్స్ చెల్లించినట్టు సమాచారం.
అంటే పుష్ప 2 సినిమా అసలు కలెక్ట్ చేసింది కేవలం రూ. 1250 కోట్లేనా అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అసలు రూ. 531 కోట్లు పుష్ప 2 ఎక్కువ వచ్చాయా.. ? లేకపోతే తక్కువ వచ్చాయనేది తేలాల్సి ఉంది. మొత్తంగా అల్లు అర్జున్ టీమ్ మాత్రం పుష్ప 2 రూ. 2200 కోట్లు అని చెప్పుకుంటూ ఉంటే.. ఆయన ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ మాత్రం రూ. 1250 కోట్లు వసూళు చేసిందని చెబుతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ కట్టిన టాక్స్ ఆధారంగా చూసుకుంటే.. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా రూ 1250 కోట్ట గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. లేకపోతే నిర్మాతలు ఎక్కువ మొత్తంలో టాక్స్ ను ఎగ్గొట్టారా అనేది తేలాల్సి ఉంది.