Andhra Pradesh DGP Rajendranath Reddy Releive From Service: ఎన్నికల ముందు ఏపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన జగన్ సర్కార్ కు బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని, బదిలీ చేస్తు ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు పంపించింది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు డీజీపీపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ సర్కార్ కు ఫెవర్ గా పనిచేస్తున్నారంటూ ఈసీ కి అనేక మార్లు కంప్లైంట్ లు ఇచ్చారు. ఏపీలో ఎన్నికలను సవ్యంగా నిర్వర్తించడంతో, శాంతి భద్రతలను కాపాడటంతో డీజీపీ అలసత్వం వహించినట్లు అనేక పార్టీల నుంచి ఫిర్యాదులు ఈసీకి వెల్లువెత్తాయి.
దీంతో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల నుంచి డీజీపీని తక్షణమే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశించింది. అదే విధంగా.. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త జాబితా పంపాలని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లను పంపించాలని కూడా ఏపీ సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ సూచించింది. ఏపీలో కొన్నిరోజులుగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోక వైపు సీఎం జగన్ తనదైన స్టైల్ లో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు అనేక మంది పోలీసులు, ఐపీఎస్ అధికారులు సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహారిస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే అనేక జిల్లాలలో ఈసీ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఇక.. ఐపీఎస్ లను కూడా బదిలీ చేసింది. సీఎస్, డీజీపీలు కూడా సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహారిస్తున్నారని,ముఖ్యంగా సీఎస్ జవహార్ రెడ్డి అనుకూల జగన్ వర్గం అధికారులను నియమించుకుంటున్నారని కూడా ఆరోపణలు గుప్పించారు. టీడీపీ వాళ్లను కావాలనే అణచివేస్తున్నారంటూ అనేక ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో ఈసీ ఈరోజు ఏపీ డీజీపీని విధుల నుంచి రిలీవ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఏపీ డీజీపీ గా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినప్పటి నుంచి కూడా అనేక వివాదాలు ఆయన చుట్టు తిరుగుతున్నాయి. ఆయన కన్నా సీనియర్లను పక్కన పెట్టీ మరీ ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన నేతల పలు ఫిర్యాదుల మేరకు తాజాగా, ఈసీ ఏపీ డీజీపీని పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం.
Read More: DY Chandrachud: స్కూల్ లో నన్ను చావబాదారు.. సెమినార్ లో ఎమోషనల్ అయిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter