YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు దిమ్మతిరిగేలా.. కీలక నేతను రంగంలోకి దింపిన జగన్..!

Andhra Pradesh Politics: ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వ వైభవం రాబోతోందా..! ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రాకతో పార్టీ కేడర్ ఖుషీ అవుతోందా..! విశాఖ కేంద్రంగా కూటమి సర్కార్‌ను వైసీపీ ఎలా ఇబ్బంది పెట్టబోతోంది..! ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం పొందవచ్చని ఫ్యాన్‌ పార్టీ భావిస్తోందా..!   

Written by - G Shekhar | Last Updated : Oct 26, 2024, 05:27 PM IST
YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు దిమ్మతిరిగేలా.. కీలక నేతను రంగంలోకి దింపిన జగన్..!

Andhra Pradesh Politics: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పార్టీ పూర్తిగా డీలా పడింది. గతంలో ఐదేళ్లు అధికారాన్ని ఎంజాయ్‌ చేసిన నేతలు జగన్‌కు గుడ్‌ బై చెబుతున్నారు. రోజుకో నేత అధికార పార్టీలో చేరిపోతున్నారు. బాలినేని, సామినేని, మోపీదేవి, బీదా మస్తాన్‌ రావు లాంటి లీడర్లు పార్టీని వీడారు. ఈ సమయంలో పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు ఆ పార్టీ అధినేత జగన్‌.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రీజినల్‌ కో ఆర్డినేటర్లను నియమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా ఎంపీ విజయసాయి రెడ్డిని నియమించారు. విజయసాయికి ఈ బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తున్నారట.. 

Also Read: Ponguleti Srinivas Reddy: పొంగులేటి మార్క్ రాజకీయం.. ఖమ్మంలో ఆ పార్టీ నేతలకు బంపరాఫర్

గతంలో వైసీపీకి ఉత్తరాంధ్ర కంచుకోటలా ఉండేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కంచుకోట బద్దమైంది. ఉత్తరాంధ్ర నుంచి కేవలం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. బొత్స సత్యనారాయణ లాంటి లీడర్‌ సైతం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అటు విశాఖలోనూ కీలక నేతలు మట్టికరిచారు. కూటమి పార్టీల దెబ్బకు ఫ్యాన్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ లీడర్లలో కొందరు పార్టీని వీడితే.. మరికొందరు లీడర్లు సైలెంట్‌ అయిపోయారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని ముందే అంచనా వేసిన జగన్‌.. ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఇన్నాళ్లు కొనసాగిన వైవీ సుబ్బారెడ్డిని తప్పింది విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించముందే.. చాలా యాక్టివ్‌ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి.. సొంత పార్టీ లీడర్లను యాక్టివ్‌ మోడ్‌లోకి తీసుకువస్తూనే.. కూటమి సర్కార్‌కు సవాల్‌ విసరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

తాజాగా విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు స్థానిక వైసీపీ లీడర్లు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. అయితే విశాఖలో అడుగు పెడుతూనే కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు ఎంపీ విజయసాయి. కూటమి సర్కార్‌ రాష్ట్రంలో వచ్చాక.. అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. అంతేకాకుండా 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వైఎస్ఆర్సిపి వ్యతిరేకమని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. గతంలో ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి. కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని ఆరోపించారు.. 

మరోవైపు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని ప్రకటించారు ఎంపీ విజయసాయి. త్వరలోనే వైసీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరిస్తానన్న ఎంపీ విజయసాయి రెడ్డి.. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు జరుగుతుందన్నారు. మరోవైపు దసపల్లా, NCC భూములతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎటువంటి అభ్యంతరం లేదని.. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటించారు.. 

మొత్తంగా ఎంపీ విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కూటమి సర్కార్‌ చాలా బలంగా ఉంది. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, వంగలపూడి అనిత లాంటి లీడర్లు ఉన్నారు. వీరిని తట్టుకుని ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీని ఎలా గట్టెక్కాస్తారు అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

Also Read: Sai Dharam Tej: అల్లు అర్జున్ గురించి సాయి ధరమ్ తేజ్.. ఏమన్నారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News