గోదావరి ( Godavari ) నదీ పరివాహక ( River catchment area )ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాజమండ్రి ( Rajahmundry ) ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ విడుదల చేసారు. నదీ ప్రవాహం మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్ర ( Maharashtra ) , ఉపనదుల ( Sub Rivers of Godavari ) పరివాహక ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు నమోదవతున్నాయి. దాంతో గోదావరి నదిలోకి వరద నీరు ( Godavari Flood ) పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. ధవిళేశ్వరం బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ( First Warning level ) ను జారీ చేశారు. అటు బ్యారేజ్ గేట్లను ఎత్తి..పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు. ఇది కాకుండా తూర్పు డెల్టాకు 2 వేల 5 వందల క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 3 వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 250 క్యూసెక్కుల నీటిని వ్యవసాయం కోసం వదులుతున్నారు. గోదావరి నది ప్రధాన పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రలోనూ, గోదావరి ఉపనదులైన ప్రాణహిత ( Pranahitha ), పెన్ గంగ ( Pen ganga ) పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ( Heavy rains ) వరద నీరు పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు మరింత పెరిగే అవకాశముందని అధికార్లు అంచనా వేస్తున్నారు. Also read: Ram Tweet on Jagan: కుట్ర జరుగుతోందంటూ హీరో ట్వీట్ కు కారణమదేనా