జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే కీలక బాధ్యతలు నిర్వహించే ఆఫీసర్స్ ఎంపికను చకచకా చేస్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తుండగా ఇప్పుడు తాజాగా పోలీస్ బాస్ గా ఠాకూర్ స్థానంలో జీపీగా గౌతమ్ సవాంగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం డీజీపీ ఎంపికకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ముందే ఆయన్ను నియమించనున్నారు. ప్రమాణ స్వీకార భద్రతా ఏర్పాట్ల బాధ్యత ఆయనకే అప్పగించనున్నట్లు టాక్
గౌతమ్ సవాంగ్ ప్రస్థానం..
1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సవాంగ్ 1963 జులై 10న జన్మించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాగా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ పాటు పలు కేంద్రం సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఏరికోరి తెచ్చుకుంటున్న జగన్
గౌతమ్ సవాంగ్ అర్హతలు, ఎచీవ్‌మెంట్స్, అనుభవం తదితర పరిగణనలోకి తీసుకొని ఆయన్న డిజీపీగా ప్రయోట్ చేయాలని భావించిన జగన్ ..ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన పెట్టినట్లు సమచారం. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను గౌతమ్ సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు