School Holidays: విద్యార్థులకు మరోసారి గుడ్‌న్యూస్‌.. ఈనెలలోనే స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు!

School Holidays In AP: విద్యార్థులకు మరోసారి ఎగిరి గంతేసే వార్త.. మరోసారి స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇది విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. సెప్టెంబర్‌ నెల నుంచి విద్యార్థులకు తుపాను, భారీ వర్షాలు, పండుగల నేపథ్యంలో వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఈ నెలలో మరోసారి వరుసగా సెలవులు రానున్నాయి. ఎందుకో తెలుసుకుందాం.
 

1 /6

స్కూళ్లకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. గత నెలలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో అనేక అల్పపీడనలు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి.  

2 /6

ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మరోసారి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో పరిస్థితుల ఆధారంగా స్కూళ్లకు సెలవులు రానున్నాయి  

3 /6

భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, తుఫాను నేపథ్యంలో వరికోతలకు వెళ్లే రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించింది. అంతేకాదు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకుండా ఆదేశించింది.  

4 /6

రేపట నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అయితే, 29వ తేదీ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని ఐఎండీ హెచ్చరించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వర్షాల ఆధారంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు.  

5 /6

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావం ఏపీ, తమిళనాడుతోపాటు అండమాన్‌ నికోబర్‌ దివులపై కూడా చూపనుంది.  

6 /6

రేపటి నుంచి కృష్ణ, గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో గంటకు 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందట. ఇక తిరుపతిలో కూడా భారీవర్షాలు పడతాయి.