Group 2 exams: గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. గత కొన్ని రోజులుగా గ్రూప్ 2 ఎగ్జామ్ లు వాయిదా పడతాయని కూవా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామ్ లు వాయిదా పడుతున్నాయని వార్తలు వైరల్ గా మారాయి. దీనికి ప్రధాన కారణం ఆర్ ఆర్ బీ టెక్నికల్ ఎగ్జామ్ లు కూడా.. డిసెంబరు 16 నుంచి 18 వరకు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ లకు తెలంగాణ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారంట.
దీంతో టీజీపీఎస్సీ ఇప్పటికే డిసెంబర్ 16, 17 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ లను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 9 హల్ టికెట్ లు సైతం డౌన్ లోడ్ చేసుకొవాలని సూచించింది.
ఈ క్రమంలో అభ్యర్థులు మాత్రం.. ఒక్కసారిగా గందర గోళానికి గురైనట్లు తెలుస్తొంది. కొంతమంది తాము.. ఒకే రోజు ఎగ్జామ్ లు ఉండం వల్ల నష్టపోతామని.. ఆర్ఆర్బీ కేంద్రం నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాలలో పోటీ ఉంటుంది. అందుకే.. టీజీపీఎస్సీ అధికారులు దీనిపై స్పందించి ఎగ్జామ్ లను వాయిదా వేయాలని కొంత మంది అభ్యర్థులు టీజీపీఎస్సీని కోరినట్లు తెలుస్తొంది.
దీనిపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఎగ్జామ్ లు యథాతథంగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని.. వాయిదా ప్రసక్తి ఉండదని టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
783 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 15వ , 16 తేదీల్లో.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు..రెండు రోజులు 4 పేపర్లను నిర్వహించనున్నట్లు తెలుస్తొంది.