Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ 10 రోజులు దర్శనాలు రద్దు..!

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. మీరు తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం చేసుకోవడనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీకు బ్యాడ్‌ న్యూస్‌. ఓ పదిరోజులపాటు శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు చేసింది టీటీడీ యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. దేశం మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా శ్రీవారిని కన్నులారా చూసి తరిలించాలని కోరుకుంటారు. అందుకే నిత్యం వేల మంది భక్తులు క్యూకాంప్లెక్స్‌లలో కూడా బారులు తీరి ఉంటారు.  

2 /5

ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనార్ధం టిక్కెట్లను విక్రయిస్తుంది టీటీడీ యంత్రాంగం. ఇది అధికారిక వెబ్‌సైట్‌ అయిన ttddevasthanm.online.on ద్వారా విక్రయాలు చేస్తారు. అంతేకాకుండా శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో కూడా టిక్కెట్లను కూడా విక్రయిస్తారు. ఇది కాకుండా నడకమార్గం వెళ్లే భక్తులకు కూడా టిక్కెట్లు అందజేస్తారు.  

3 /5

అయితే, వచ్చే ఏడాది 2025 జనవరి 10 వైకుంఠ ఏకాదశి జరగనుంది. ఈ సందర్భంగా భక్తులకు ఉత్తరాద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ యంత్రాంగం. ఇది పది రోజులపాటు నిర్వహించనున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిచనున్నారు.  

4 /5

దీనికి తగిన చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డలకు సంబంధించిన ప్రత్యేక దర్శనాలు కల్పించే మార్గం ఈ పదిరోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. భక్తులు ఏ ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.  

5 /5

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఏ ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది టీటీడీ.