YS Jagan Proud To Be Father After His Daughter YS Varsha Reddy Takes Degree: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో ఒక సంతోషకర పరిణామం జరిగింది. అతడి కుమార్తె వైఎస్ వర్షా రెడ్డి మాస్టర్స్ పూర్తి చేసింది. తన కుమార్తె అత్యుత్తమ ప్రతిభతో మాస్టర్స్ పూర్తి చేయడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశాడు. తన కుమార్తెకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో తొలిసారి ఒక సంతోషకర సంఘటన జరిగింది. అతడి కుమార్తె వలన వైఎస్ జగన్ ఆనందంలో మునిగారు.
వైఎస్ జగన్‌కు ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి. చిన్న కూతురు వర్షారెడ్డి లండన్‌లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కళాశాలలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది.
మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కామర్స్‌లో వైఎస్ వర్షా రెడ్డి విద్యాభ్యాసం పూర్తి చేసింది. తాజాగా లండన్‌లో పట్టా పంపిణీ చేపట్టారు.
లండన్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ తన సతీమణి భారతి, పెద్ద కుమార్తె హర్షతో కలిసి వెళ్లారు.
తన కుమార్తె వర్షా రెడ్డి డిస్టింక్షన్లో పాసవడంతో వైఎస్ జగన్ హర్షాతిరేకం వ్యక్తం చేశాడు. తన కుమార్తెను అభినందిస్తూ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
లండన్‌లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కళాశాలలో తన కుమార్తె వర్షా రెడ్డి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ జగన్ ఓ ఫొటోను విడుదల చేశారు.
తన కుమార్తెను అభినందిస్తూ చేసిన పోస్టుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానులు లైక్‌లు, రీట్వీట్, షేర్ చేస్తున్నారు.
కుమార్తెల కోసం లండన్ వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ తన కుటుంబంతో సహా స్వగ్రామానికి చేరుకుంటారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు తిరిగి వస్తారని ప్రచారం జరుగుతోంది.