Latest Viral News in Telugu: "ప్రేమ గుడ్డిది. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు.." అంటూ సినిమాల్లో డైలాగ్స్ వినే ఉంటారు. నిజమే.. నిజ జీవితంలో చాలా వెరైటీ ప్రేమ కథలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మాత్రం చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. కాబోయే కోడలిని మామ ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? పెళ్లి చేసుకోవాలనుకున్న వరుణు రియాక్షన్ ఏంటి..?
తన కొడుకు చేసుకోబోయే అమ్మాయిని తండ్రి పెళ్లి చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటుచేసుకుంది. తండ్రి ఇచ్చిన ట్విస్ట్‌తో ఆ కొడుకు సన్యాసిగా మారేందుకు రెడీ అయిపోయాడు.
నాసిక్‌లో ఓ తండ్రి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు సంబధాలు వెతికాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చాడు.
రెండు కుటుంబాలు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని.. ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరోవైపు వరుడు పెళ్లి కలల్లో తేలిపోతున్నాడు.
ఇంతలో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లే నటించిన పెళ్లి కుమారుడి తండ్రి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కొడుక్కి వెన్నుపోటు పొడిచి.. కాబోయే కోడలితో ప్రేమలో పడ్డాడు.
ఆ యువతి కూడా అతడిని ప్రేమించింది. దీంతో ఇద్దరు ఎవరికి చెప్పకుండా.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి వరుడు షాక్‌కు గురయ్యాడు.
తండ్రి వెన్నుపోటును సహించలేకపోయాడు. తండ్రి అలాంటి పని చేయడంతో ఇక జీవితంలో తాను పెళ్లి చేసుకోనని.. ఒంటరిగా బతకాలని నిర్ణయం తీసుకున్నాడు.
వరుడిని సముదాయించిన బంధువులు.. ఈ అమ్మాయి లేకపోతే ఏంటి..? మరో మంచి అమ్మాయిని వెతుక్కుని పెళ్లి చేస్తామని చెప్పినా.. అతను వినలేదు. తనకు పెళ్లి మీద నమ్మకం పోయిందని.. జీవితాంతం సన్యాసిగా బతికేస్తానని చెబుతున్నాడు.