Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఇప్పటి వరకూ మూడు విడతలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నాలుగవ విడత వారాహి యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత జరగనున్న యాత్ర కావడంతో ఈసారి యాత్రలో పసుపు జెండాలు దర్శనమివ్వనున్నాయి.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇప్పటి వరకూ మూడు విడతలు పూర్తి చేసుకుని 4వ విడత అక్టోబర్ 1 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారాహి యాత్ర అప్‌డేట్ రావడంతో జన సైనికుల్లో మరోసారి ఉత్సాహం పెల్లుబుకుతోంది. నాలుగవ విడత యాత్ర కృష్ణా జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో జరగనుంది.
తొలి విడత వారాహి యాత్రలో వ్యక్తులపై, రెండవ విడతలో వ్యవస్థలపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు నాలుగవ విడత యాత్రకు ముందు జరిగిన పరిణామాల నేపధ్యంలో ఈ యాత్రకు ప్రాధాన్యత పెరుగుతోంది. చంద్రబాబు అరెస్టు కావడం, వెనువెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించడం అందరికీ తెలిసిందే. చంద్రబాబును పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందని ప్రకటించారు. అందుకే వారాహి 4వ విడత యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపధ్యంలో వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఉంటుందనేది అంచనా. అదే నిజమైతే ఈసారి జనసైనికుల జెండాలతో పాటు పసుపు జెండాలు కూడా వారాహి యాత్రలో రెపరెపలాడనున్నాయి.
Also read: AIADMK: దక్షిణాదిన బీజేపీకు షాక్, ఎన్డీయే నుంచి వైదొలగిన ఏఐఏడీఎంకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook