ఎన్నికలో ఘోర వైఫల్యం చెందిన జనసేన పార్టీ ఇప్పుడు సరికొత్త పంథా అనుసరిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకుగాను మరియు పార్టీ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు వేర్వేరుగా 20 కమిటీలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. జనసేన పార్టీ ముఖ్యమైన కమిటీల ఏర్పాటుపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఓ ప్రకటన చేశారు. జనసేన నూతన కమిటీల్లో అర్హత, పార్టీ పట్ల విధేయత కనబరిచిన వారికి ప్రాధాన్యత ఇవనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం.