Nagababu on Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని ముందు నుంచి చెబుతుంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకపక్క పవన్ కళ్యాణ్ మరోపక్క చంద్రబాబు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వకూడదు అనే ఉద్దేశంతో ఉండడంతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయవచ్చని అంచనా ముందు నుండి కనిపిస్తోంది.
తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నాగబాబు ఈ పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పొత్తులు కనుక లేకపోతే ఏపీలో ఉన్న అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, అయితే పొత్తుల సంగతి ఇంకా నిర్ణయించడానికి చాలా సమయం ఉందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని చెప్పడం వెనుక ఒక వ్యూహం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ విమర్శల స్థాయి దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తీసుకొచ్చిందని పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శించవచ్చు కానీ వైసీపీల దిగజారిపోయి మాట్లాడకూడదని అన్నారు.
మేము అలా ఎప్పటికీ దిగజారి మాట్లాడమని పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే మా లక్ష్యం అని అన్నారు. కొంతమంది అయితే లైన్ లోకి రావడానికి జనసేనని విమర్శిస్తున్నారని వారికి మేము అలా ఉపయోగపడుతున్నాం అనుకుంటే తిట్టనివ్వండి అని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేసే పనిలో మేముంటే సింహం సింగిల్ గా వస్తుందంటూ కొందరు సినిమా డైలాగులు చెబుతున్నారు. వాటికి అసలు స్పందించాల్సిన అవసరమే లేదని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఒకానొక సందర్భంలో జర్మనీని ఓడించాలని అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా కలిశాయని ఇప్పుడు ఒకవేళ వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నామని నేను మాత్రం వచ్చి ఎన్నికల్లో పోటీ చేయను కానీ పార్టీని పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని అన్నారు. సంస్తాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేన మీద జనంలో అభిమానం, నమ్మకం లేదు, అనే విషయం నిజం కాదని సంస్థ గత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ టిడిపి, వైసీపీ వంటి పార్టీలు కూడా గతంలో పరాజయం పాలయ్యాయి అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
Also Read: VSR vs WV Collections: ఒకే రోజు-ముప్పై కోట్ల తేడా.. 'వీర సింహా' vs వీరయ్య బాక్సాఫీస్ పోటీ చూశారా?
Also Read: Love Today Scene: తమిళనాడులో ఫోన్లు మార్చుకున్న లవ్ కపుల్.. 'ఆ' వీడియోలు బయటపడడంతో మొదటికే మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook