Odisha Train Accident: ఒడిశాలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కారణం ఈ తరహా రైలు ప్రమాదం మరెక్కడా జరగలేదు. ఏకంగా మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న ఘోరమైన ప్రమాద ఘటన ఇంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఇప్పటి వరకూ 237 మంది ప్రాణాలు కోల్పోగా..1000 మంది వరకూ గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడివారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా, లేదా, అనేది తెలుసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.
అయితే ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు కోరమాండల్ రైలులో 120 మంది తెలుగువారున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం నేపధ్యంలో రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, బాపట్ల , తెనాలి, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంటల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. ఘటనా స్థలానికి మంత్రి అమర్ నాథ్ ఆధ్వర్యాన ముగ్గురు ఐఏఎస్ అదికారుల బృందాన్ని పంపిస్తున్నారు. అత్యవసర సేవలకై ఒడిశా సరిహద్దు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో అలర్ట్ ప్రకటించారు.
Also read: Odisha Train Accident Update: ఘోరకలిలో 233కు చేరుకున్న మృతుల సంఖ్య, క్షతగాత్రులు వేయికి పైనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook