Pawan Kalyan Delhi Strategy: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. అంతేకాదు ఆ పార్టీ తురుపు ముక్కగా మారాడు. సనాతన బోర్డు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో జనసేనానికి దేశ వ్యాప్తంగా ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. బీజేపీ తర్వాత ఓ పార్టీ నాయకుడు హిందూత్వం గురించి ఈ రేంజ్ లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశామంత పెరిగిందనే చెప్పాలి. దీంతో ఆయన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల్లో ఆయన సినిమాలు కూడా తెలియని వాళ్లు కూడా పవన్ పై అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాదు దక్షిణాదిలో హిందుత్వకు ఐకాన్ గా మారాడు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ నాయకులు చేయలేని పనిని జనసేనాని చేసి పెడుతున్నాడు. ఆ పార్టీ నాయకులే మాట్లాడానికి సంకోంచే విషయాలను కూడా ఎంతో నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా దక్షిణాది యోగిగా ఎదిగారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని బీజేపీ పెద్దలైన నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డాలు పవన్ కళ్యాణ్ సేవలను మరింత విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని గుర్తించిన బీజేపీ అగ్రనేతలు ఇక ముందు జరిగబోయే ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసేలా వ్యూహాలు రచిస్తోంది.
2025లో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఓ రోడ్ మ్యాప్ తయారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారున్న చోట పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలనే యోచనలో ఉన్నారు.ఓ వైపు హీరో.. మరోవైపు సనాతన ధర్మం అంటూ పవన్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లింది. అంతేకాదు ఏపీ నుంచి జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. దీంతో పవన్ ఇమేజ్‌తో ఓట్లు కొల్లగొట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెడుతోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter