మెగాస్టార్ చిరంజీవి ప్రచారంపై జససేన చీఫ్ పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అన్యయ ప్రచారానికి వస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.. కానీ తన పార్టీ తరఫున తన అన్యయ్య చిరంజీవి రావడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలను ఆయన చూసే విధానం... తాను చూసే విధానం వేరువేరని తెలిపారు. ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య పూర్తి స్పష్టం ఉందని చెప్పారు. అన్నయ్య చిరంజీవి రాజకీయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చేశారని పేర్కొన్నారు. ఆయన్ను కళాకారుడిగా గౌరవించాల్సి ఉందని పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
యాక్టర్ల ప్రచారంతో ఓట్లు రాలవు..
సినీ నటుల ప్రచారంపై పవన్ మాట్లాడుతూ తాను ఎన్నికల ప్రచారం కోసం యాక్టర్ల మీద ఆధారపడను. నటుల ప్రచారం కంటే రాజకీయ సిద్ధాంతాల మీద ఆధారపడతానని పవన్ కళ్యాణ్ వివరించారు. సినీ యాక్టర్ల ప్రచారంతో జనాలు రావడం వరకు మాత్రమే పని చేస్తుందని...ఓట్ల రావాలంటే మన విధానాలు జనాలకు నచ్చాలని పేర్కొన్నారు. రాజకీయ అవగాహన, భావజాలం, విధాన నిర్ణయాలపై తాన అవగాహనతో నడుచుకుంటున్నానని పవన్ వివరించారు
జనసేన తరఫున పవన్ ఒక్కరే ప్రచారం
ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను రంగంలోకి దించుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున ఇప్పటికే వైఎస్ విజయమ్మ, షర్మిల రంగంలోకి దిగారు. దీనికి తోడు పలువురు సినీ యాక్టర్లు కూడా రంగంలోకి దిగారు. అటూ బీజేపీ కూడా సినీనటులను రంగంలో దించింది. టీడీపీ తరఫున చంద్రబాబు, నారాలోకేష్ ప్రచారం చేస్తున్నారు. అయితే జననేన తరఫున పవన్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు..ఈ క్రమంలో చిరంజీవి జనసేన తరఫున ప్రచారం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ మేరకు స్పందించారు