కర్నూల్ ఉర్దూ యూనివర్సిటీకి 100 కోట్లు..?

యూనివర్సిటీలో డాక్టర్ అబ్దుల్ కలామ్ పేరు మీద కట్టే క్యాంపస్‌కు దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతుందని అధికారిక అంచనా

Last Updated : Nov 25, 2017, 05:55 PM IST
కర్నూల్ ఉర్దూ యూనివర్సిటీకి 100 కోట్లు..?

జనవరి 2018 నెలలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు ఓర్వకల్ ప్రాంతంలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో డాక్టర్ అబ్దుల్ కలామ్ పేరు మీద నెలకొల్పే క్యాంపస్‌కి శంఖుస్థాపన చేస్తారని , ఆ విశ్వవిద్యాలయ ఉప కులపతి కె.ముజఫర్ అలీ షామిరి తెలిపారు. ఈ యూనివర్సిటీ నిర్మాణానికి 144 ఎకరాల స్థలం కేటాయించినట్లు సమాచారం. అలాగే 18.4 కోట్ల రూపాయలను తొలివిడతలో నిర్మాణానికి కేటాయించారు.

దాదాపు ఒక సంవత్సరంలో ఈ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతుందని అధికారిక అంచనా. ఇప్పటికే ఈ విషయమై యూజీసీకి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సమాచారం అందించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 176 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 90 శాతం మంది మహిళలే ఉన్నారు. బిఏ (ఉర్దూ), ఎంఏ (ఉర్దూ)తో పాటు ఉర్దూ మాధ్యమంగా బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను కూడా ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది.  గత సంవత్సరమే  ఈ యూనివర్సిటిని ఏపీ ప్రభుత్వం కర్నూలులో నెలకొల్పింది. 

Trending News