బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసంహిరావుకు ఢిల్లీలో చేధు అనుభవం ఎదురైంది. ఓ ప్రెస్ మీట్ మాట్లాడుతున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. అనూహ్య ఘటనతో జీవిఎల్ షాక్ కు గురయ్యారు. కాగా ఘటనతో వెంటనే తేరుకున్న పార్టీ కార్యాలయం సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం ఆ వ్యక్తిని స్థానిక కమల్నగర్ పీఎస్ కు తరలించారు. ఏ కారణం చేత అతను చెప్పు విసిరాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. అయితే అతను యూపీలోని కాన్నూర్ కు చెందిన శక్తి భార్గవ గా గుర్తించారు. ఇద్దరి మధ్య ఏమైన వ్యక్తిగత గొడవులు ఉన్నాయా.. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది
సాధారంణంలో పబ్లిక్ మీడింగ్ లో వైరీ వర్గాల వారు ఇలా చెప్పులు విసరటం లాంటివి మనం చూస్తుంటాం. అయితే ఇది ఒక ప్రెస్ కాన్షరెన్స్ లో జర్నిలిస్టుకు మాత్రమే అనుమతి ఉంటుంది..లేదంటే పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే లోనికి రాగలడు. ఈ నేపథ్యంలో అతను ఏదైన మీడియాకు చెందిన వ్యక్తి అయి ఉండాలి లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.