Chandrababu: పోలవరం ప్రాజెక్ట్‌ను టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ముంపు మండలాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక తన దగ్గర ఉందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి చేసి..పోలవరం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని తేల్చి చెప్పారు.
ఇందుకు ముంపు మండలాల ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నిర్వాసితులకు పరిహారం ఎగ్గొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. పరిహారం నెపాన్ని కేంద్రంపై నెట్టుతోందని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే నిర్వాసితులకు న్యాయం చేసేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గోదావరి వరదలు సంభవించడంతో తెలంగాణ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలం ముప్పునకు గురవుతోందని ఆరోపించారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
దీనిపై పెనుదుమారం రేగింది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ప్రశాంతంగా ఉన్న చోట ఇలాంటి వ్యాఖ్యలు సరికావని ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ముంపు గ్రామాలను ఆడిగితే తాము హైదరాబాద్ అడుగుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రాంతం తెలంగాణకు పోవడం వల్ల చాలా నష్టపోయామని తెలిపారు.
ఈక్రమంలో ఏపీలోనూ రాజకీయ దుమారం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరు సరిగా లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. దీనికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తమ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
Also read:KTR: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి
Also read:Russia vs Ukraine: సొంత సైనికులపైనే ఉక్రెయిన్ దాడి చేసిందా..బాంబు దాడి ఎవరి పని..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook