YS Jagan Case Hearing: అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అధికారం కోల్పోయి రాజకీయంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన జగన్‌కు వ్యక్తిగతంగా ఉచ్చు బిగుస్తోంది. జగన్‌పై ఎప్పటి నుంచో వ్యక్తిగత కేసులు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి ఉండడంతో ఆ కేసుల్లో పురోగతి కనిపించలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి కావడంతో జగన్‌కు కష్టాలు మొదలవుతున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Chandrababu Plot Bribe: ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పని లంచం.. రూ.లక్షన్నర అడిగిన అధికారి సస్పెండ్
అక్రమాస్తులు కలిగి ఉన్నారని 2010-13 కాలంలో అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికవడంతో ఆ కేసుల ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కావడంతో జగన్‌కు సంబంధించిన కేసుల్లో విచారణ దూకుడు పెరిగింది. తాజాగా సీబీఐ కోర్టులో జగన్‌పై ఉన్న కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసుపై గతంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మసానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ చేయాలని సీబీఐకి ఆదేశించింది. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అనంతరం హైకోర్టు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
ఏం జరగనుంది?
అక్రమాస్తుల కేసుల్లో జగన్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారంలో ఉండడంతో ఐదేళ్ల పాటు ఈ విచారణ నత్తనడకన సాగింది. ఇక ప్రత్యక్ష హాజరు నుంచి కూడా సీఎంగా ఉన్న జగన్ మినహాయింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ కావడంతో త్వరలోనే జగన్ ప్రత్యక్షంగా విచారణకు అయ్యేలా పరిణామాలు మారనున్నాయి. ఈ మేరకు సీబీఐ జగన్‌ను ప్రత్యక్ష విచారణకు పిలిచే అవకాశం ఉంది. కొందరి ఒత్తిడితో జగన్ బెయిల్ పిటిషన్‌ను కూడా రద్దు చేసేలా త్వరలో కీలక పరిణామం చోటుచేసుకుంటుందని చర్చ జరుగుతోంది. ఇదే కనుక జరిగితే జగన్ మరోసారి జైలుకు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి