ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకు అనేకంటే ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ అభిమానులకు ఇవాళ్టి రోజు అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఎన్టీ రామారావు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నేటికి సరిగ్గా 40 ఏళ్లు.
1983 జనవరి 9వ తేదీ. తెలుగువారి చరిత్రలో మర్చిపోని రోజు. తెలుగు రాష్ట్రాన్ని తొలిసారిగా తెలుగు ప్రజల పార్టీ పాలించేందుకు లిఖితమైన రోజు. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకు విన్పించాలనే పిలుపుతో తెలుగుదేశం పార్టీకు అంకురార్పణ చేసిన మహనీయుడు ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే ఎన్నికలు ఎదుర్కొని అఖండ మెజార్టీతో విజయం కైవసం చేసుకుని ఏపీకు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది. తొలిసారి పోటీలోనే 200 సీట్లు సాధించిన ఘనత నందమూరి తారక రామరావుది.
1983 జనవరి 9వ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన పరిపాలన, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వ్యవహరించిన తీరు అన్నీ ఇప్పటికీ ప్రజలకు గుర్తుంచాయి. ఆ తరువాత 1984 ఆగస్టు 15న నాదెండ్ల భాస్కరరావు రూపంలో తొలిసారి వెన్నుపోటు ఎదుర్కొని పదవి కోల్పోయారు ఎన్టీఆర్. ఫలితంగా నాదెండ్లతో పాటు అప్పటి గవర్నర్ రామ్‌లాల్ చరిత్రహీనులుగా నిలిచిపోయారు. నాటి వెన్నుపోటుకు ప్రజా పోరాటంతో నెలరోజుల్లోనే గద్దె దింపగలిగారు ఎన్టీఆర్. 1984 సెప్టెంబర్ 16న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తరువాత కొద్దికాలానికి అసెంబ్లీ రద్దు చేసి 1985 మార్చ్ నెలలో ఎన్నికలకు వెళ్లి మరోసారి 200 పైగా సీట్లు సాధించారు. మార్చ్ 9న మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే వరుసగా 1983, 1984, 1985లో మూడు సంవత్సరాలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత దక్కించుకున్నారు ఎన్టీ రామారావు. 1989 ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష నేతగా నిలిచారు. నేషనల్ ఫ్రంట్ స్థాపనలో కీలకపాత్ర పోషించారు. తిరిగి 1994 ఎన్నికల్లో మళ్లీ గెలిచి 220 సీట్లు సాధించుకున్నారు. 1995 ఆగస్టులో రెండవసారి అల్లుడు చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురై..మళ్లీ పదవి కోల్పోయారు.
Also read: KA Paul Comments: వేయి కోట్లకు జనసేనను టీడీపీకు తాకట్టు పెట్టిన పవన్, కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook