Vijaysai On Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ దుమారంగా మారింది. నారాయణకు మద్దతుగా టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నారాయణ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఏపీ గవర్నర్ కు హరిచందన్ విశ్వభూషణ్ కు కూడా లేఖ రాశారు చంద్రబాబు.
అయితే నారాయణ విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.నారాయణ అరెస్ట్ ఎపిసోడ్ పై చంద్రబాబుపై ఆయన సెటైర్లు వేశారు.
పేపర్ల లీకును సేవగా గుర్తించి పద్మ శ్రీ ఇవ్వాలా ఏంటీ బాబూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను స్పష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావని చంద్రబాబును నిలదీశారు విజయసాయి రెడ్డి.ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే వత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు నీకు వినబడలేదా బాబూ అని సాయి రెడ్డి ట్వీట్ చేశారు. అందుకేనా ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయనను మంత్రిని చేసింది అని తన ట్వీట్ లో ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.
చిత్తూరు జిల్లాలో వెలుగులోనికి వచ్చిన పదో తరగతి పరీక్షా పేపర్ లీక్ కు సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులోనే మంగవారం నారాయణను హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య చిత్తూరుకు తరలించారు. అర్ధరాత్రి తర్వాత వైద్య పరీక్షల అనంతరం భారీ పోలీస్ పహరా మధ్య మెజిస్ట్రేట్ ముందు నారాయణను హాజరు పరిచారు. అయితే నారాయణకు మెజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ ఇచ్చారు. నారాయణపై మోపిన అభియోగాలను ఆమె తిరస్కరించారు. 1024లోనే నారాయణ విద్యా సంస్థల చైర్మెన్ పదవి నుంచి నారాయణ తప్పుకున్నారని.. ఆయన తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. వాళ్ల వాదనలతో ఏకీభవించిన జడ్జీ సులోచనారాణి.. నారాయణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
READ ALSO: SP Rishant Reddy: పక్కా ఆధారాలతోనే మాజీ మంత్రి నారాయణ అరెస్టు
READ ALSO: YOUTH BURNT GOVT OFFICIAL : అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook