Sai Priya Case: విశాఖతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సాయిప్రియ కేసులో మరో ట్వీస్ట్. ప్రేమ జంటపై పోలీసు కేసు నమోదైంది. పోలీసులను బురిడీ కొట్టించారంటూ సాయిప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు పెట్టారు. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో వాళ్లిద్దరిపై కేసు నమోదు చేశారు.సాయిప్రియ నిర్వాకంతో ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్, పోలీసుల విలువైన టైమ్ వేస్ట్ అయిందని పోలీసులు భావించారు. తన భర్తను మోసగించి ప్రియుడితో వెళ్లడమే కాకుండా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు ఆమె సీరియస్ గా ఉన్నారు పోలీసులు. ఆమె విషయంలో కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో సాయిప్రియతో ఆమె లవర్ రవితేజపై కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు.
విశాఖపట్నానికి చెందిన సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సాయిప్రియ ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌లో ఉంటూ కంప్యూటర్ కోర్టు నేర్చుకుంటుంది. జూలై 22న పెళ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విశాఖ బీచ్ కు వెళ్లింది సాయిప్రియ. కాసేపటి తర్వాత ఆమె బీచ్‌లోకనిపించకుండా పోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో శ్రీనివాసరావుకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. ఎంత వెతికినా సాయిప్రియ కనిపించకపోవడంతో సముద్రంలో గల్లంతయ్యిందని భావించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయిప్రియ కోసం నేవీ, తీరగస్తీ దళాలు ముమ్మరంగా గాలించాయి.
స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్ ద్వారా గాలించారు. సాయిప్రియను వెతికేందుకు అధికారులు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు.హెలికాప్టర్ సాయంతో గాలించడంతో భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చింది. సముద్రంలో రెండు రోజులు వెతికినా ఆమె జాడ దొరకలేదు.ఇంతలోనే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. బీచ్ లో భర్తను ఏమార్చి తన ప్రియుడితో వెళ్లిపోయింది సాయిప్రియ. బెంగళూరులో ప్రియుడితో కలిసి ప్రత్యక్షమైంది. అక్కడే అతడిని పెళ్లి చేసుకుంది. రెండు రోజుల తర్వాత తన కోసం వెతకొద్దు.. తాను రవితేజను పెళ్లి చేసుకున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది. సాయిప్రియ ఇచ్చిన ట్విస్ట్ తో అంతా షాకయ్యారు. పోలీసుల సూచనతో తర్వాత ప్రియుడితో కలిసి విశాఖపట్నం వచ్చింది సాయిప్రియ. పోలీసులకు వివరణ ఇచ్చింది. అంతేకాదు తమకు రక్షణ కల్పించాలని కోరింది.
Read also: Telangana Police Constable : ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు.. కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్
Read also: Krithi Shetty Saree Photos: చీరకట్టులో మెరిసిన బేబమ్మ.. ఫోటోలు చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి